ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో…
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలతో ఒకే చెల్లింపుతో ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తికి ఆర్థికంగా చాలా కష్టంగా ఉంటుంది. ఇంటి కొనుగోలు కోసం నిధులను సమీకరించుకోవడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి హోమ్ లోన్(Home Loan). హోమ్‌లోన్ అనేది బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వంటి ఆర్థిక సంస్థ నుండి ఇంటిని కొనుగోలు చేసే ఏకైక ప్రయోజనం కోసం తీసుకున్న మొత్తం. మీరు హోమ్ లోన్ సహాయంతో ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా?…
యూకో బ్యాంక్ గత ఏడు, ఎనిమిది క్వార్టర్ ల నుండి గణనీయమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమ శంకర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ క్యాపిటల్ సమర్థత ప్రస్తుతం అన్ని బ్యాంక్ ల కంటే ఉత్తమంగా ఉందన్నారు. కోవిడ్ మూలంగా ప్రజలందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంచుకున్నారన్నారు. తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ తో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్…
బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మీనా జువెల్లర్స్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అయిన ఉమేష్ జేత్వానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్‌బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. మీనా జువెల్లర్స్ డైమండ్ ప్రైవేట్…
పేదలకు మేలు చేసే ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ఓటీఎస్ పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒక సంస్కరణ లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఓటీఎస్ ను తెచ్చారు. ఓటీఎస్ చేసుకోవడం ద్వారా పట్టా ఇచ్చి శాశ్వత హక్కు కల్పిస్తున్నాం. పట్టా ద్వారా తాకట్టు పెట్టుకునేందుకు, రుణం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక రూపాయి కూడా లేకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ప్రభుత్వం ఓటీఎస్…
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసులు నమోదుచేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డి పై కేసు నమోదయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసింది సీబీఐ, తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బీఓబీ ఫిర్యాదు చేసింది. ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి ఫిర్యాదు చేసింది. రూ.61.86 కోట్ల నష్టం…
రిటైల్ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. పర్సనల్, పెన్షన్ లోన్ కస్టమర్లు ఏ ఛానల్ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత రుణ కోసం దరఖాస్తు చేసుకున్న ఫ్రంట్‌లైన్ హెల్త్ కేర్ వర్కర్స్‌కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు…
1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది ఇవాళ జరిగిన ఎస్ఎల్‌బీసీ 29వ సమావేశం… బీర్కే భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఒక వారంలో దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని…