స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఇవాళ (సోమవారం) ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 16.16 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయినట్లు పేర్కొన్నారు.
Read Also: Droupadi Murmu: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కీలక సందేశం
అయితే, సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీలను మాఫీ చేసినందుకు తెలంగాణలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఉత్తర్వులతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.
Read Also: Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
ఇక, రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఇవాళ 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరపున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. రైతుల తరపున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. ఇవి రుణమాఫీ కింద బ్యాంకులకు చేరతాయని తెలిపారు.