రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ యధాతథంగా కొనసాగిస్తూ వెల్లడిచింది. కానీ, అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్’ వివిధ రుణాలపై బేస్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. MCLR ( బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ ) పది బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెల ఏడో తేదీ నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది. దీంతో ఇండ్ల రుణాలు, పర్సనల్ లోన్, ఆటో రుణాలపై ఈఎంఐలు భారీగా పెరగనున్నాయి. బేస్ రేట్ ఐదు బేసిక్ పాయింట్లు, బెంచ్ మార్క్ పీఎల్ఆర్ 15 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటిచింది. 2023 సెప్టెంబర్ 25 నుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడిచింది.
Read Also: Tamilnadu: బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఇక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 8.55 నుంచి 9.25 శాతం మేర పెరుగుతాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెరగడంతో 8.50 నుంచి 8.60 శాతానికి.. నెల గడువు గల లోన్ లపై 8.65, మూడు నెలల గడువు రుణాలపై ఐదు బేసిక్ పాయింట్లతో 8.85 శాతానికి, ఆరు నెలల టెన్యూర్ రుణాలపై 9.10 శాతానికి, ఏడాది టెన్యూర్ రుణాలపై 9.15 నుంచి 9.20 శాతానికి పెంచేశారు.
Read Also: Devara: షాకింగ్.. అనిరుధ్ అవుట్.. థమన్ ఇన్.. ?
అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేట్ 9.20 నుంచి 9.25 శాతానికి పెంచేసింది. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి పెంచిన బేస్ రేట్ అమల్లోకి వస్తుంది అని తెలిపింది. ఇంతకు ముందు జూన్ 16న బేస్ రేట్ 9.20 శాతానికి పెంచిన ఈ బ్యాంక్, బెంచ్ మార్క్ పీఎల్ఆర్.. గత జూన్ 16న 17.70 శాతం కాగా, తాజా సవరణతో 17.85 శాతానికి పెరుగుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్.. వివిధ లోన్ లపై తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ పెరిగింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.