మద్యం స్కాం కేసులో సీఐడీ నోటీసులను సవాలు చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తొందర పాటు చర్యలు తీసుకోకుండా సీఐడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా హైకోర్టు నిరాకరించింది. 164 స్టేట్మెంట్ ఇవ్వటానికి వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరటంతో ఆ దిశగా నోటీసులు…
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
దేశంలో ఎక్కడ లిక్కర్ స్కాం బయటపడ్డా… అందరి దృష్టి తెలంగాణవైపే మళ్ళుతోందా? తాజాగా తమిళనాడు మద్యం కుంభకోణం విషయంలో కూడా మరోసారి తెలంగాణ వైపు తొంగిచూసే పరిస్థితి వస్తోందా? అసలు తమిళనాడు లిక్కర్ వ్యవహారానికి, తెలంగాణకు ఏంటి సంబంధం? ఇటువైపు చూడాల్సిన అవసరం ఏం వచ్చింది? ఢిల్లీ మద్యం కుంభకోణం తరహాలోనే…..తమిళనాడులో కూడా పెద్ద స్కామే జరిగిందా? అక్కడి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందా? అంటే….. ఇప్పుడే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేంగానీ… మొత్తానికి జరగకూడనిదేదో….జరిగిపోయిందని మాత్రం…
Anna Hazare: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోరంగా ఓడిపోయింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి స్వయంగా ఓడిపోయారు. ఈయనే కాకుండా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా ఓటమి చవిచూశారు. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 48 చోట్ల బీజేపీ గెలుపొందగా,…
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని అంశాల్లో ఆప్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌ను దేశ చరిత్రలోనే అతి దారుణమైన కుంభకోణంగా అభివర్ణించారు. ఈ సందర్బంగా ఆప్ పాలన వైఫల్యాలను చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రజలకు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుచేశారు. ఆసుపత్రుల…
Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం మొత్తం కుట్ర రాయ్‌పూర్‌లో జరిగినట్లు తేలింది. రాయ్‌పూర్‌లోని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (EOW) తన ఎఫ్‌ఐఆర్‌లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించింది.
Liquor Scam Case: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్…
Liquor Policy Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లను జారీ చేసింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలకపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేశారు.. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపెట్టారు.. అయితే, మద్యం స్కాంలో ప్రభుత్వం దృష్టికి సంచలన వాస్తవాలు వస్తున్నాయట.. మద్యం శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలకంటే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయట..