Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం.. ఏడుగురిపై ఆరోపణలు..!
- జార్ఖండ్‌లో బయటపడిన మద్యం కుంభకోణం..
- ఈ స్కామ్ లో ఏడుగురి పాత్ర ఉందని ఆరోపించిన ఈఓడబ్ల్యూ..
- నిందితులపై మోసం.. నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం మొత్తం కుట్ర రాయ్‌పూర్‌లో జరిగినట్లు తేలింది. రాయ్‌పూర్‌లోని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (EOW) తన ఎఫ్‌ఐఆర్‌లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించింది. ఈఓడబ్ల్యూ తన ఎఫ్‌ఐఆర్‌లో అన్వర్ ధేబర్, ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్‌తో సహా ఏడుగురిపై ఆరోపణలు చేసింది. వారిపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. నిందితుల్లో జార్ఖండ్‌లోని ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి.
Read Also: MLA Pulivarthi Nani: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్ కామెంట్స్
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, ఈఓడబ్ల్యూ తెలిపిన ప్రకారం.. డిసెంబర్ 2022లో జార్ఖండ్ మద్యం పాలసీ టెండర్‌లో మార్పులు చేయబడ్డాయని చెప్పుకొచ్చింది. రాయ్‌పూర్‌లోని అన్వర్ ధేబర్ రహస్య స్థలంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్, జార్ఖండ్ ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు. సుమిత్ కంపెనీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది.. దీని వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పుకొచ్చింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో నకిలీ హాలోగ్రామ్‌లు వేసి రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా చేయగా.. ఇప్పుడు జార్ఖండ్‌లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చిందని పేర్కొనింది. ఈ స్కాం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ఈఓడబ్ల్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Yamaha : కేవలం రూ. 2,999కట్టి ఈ కంపెనీ టూవీలర్స్ ఇంటికి పట్టుకెళ్లండి!
కాగా, ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి రూ.11 కోట్ల భద్రతా నిధిని కేటాయించిందని ఈఓడబ్ల్యూ తెలిపింది. దీంతో పాటు ఒక ఉద్యోగి అవసరాన్ని కూడా తీర్చిందని చెప్పుకొచ్చింది. ఇక, 6 నెలల్లో రూ.200 కోట్ల టర్నోవర్ సాధించాల్సి వచ్చింది.. ఆ సమయంలో టెండర్ ప్రక్రియలో భాగమైన మద్యం హోల్‌సేల్ టెండర్‌లో పాల్గొన్నందుకు రూ.25 లక్షలు నాన్‌రిఫండబుల్‌గా నిర్ణయించారని పేర్కొనింది. లిక్కర్ స్కామ్ పై జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ స్పందించారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మద్యం మాఫియాలు ఈ కుంభకోణానికి పాల్పడ్డాయని.. అయితే ఈసారి పంజాబ్, హర్యానాల నుంచి లిక్కర్ మాఫియాలను రప్పించేందుకు జార్ఖండ్ సర్కార్ ప్లాన్ చేస్తుందన్నారు. అలాగే, బిర్సా ముండా జైలు నుంచే ఈ స్కామ్‌కు స్క్రిప్ట్ రాస్తున్నారని జార్ఖండ్ బీజేపీ చీఫ్ ఆరోపించారు.
घोटालों, चोरी और धोखाधड़ी के लिए कुख्यात हेमंत सोरेन सरकार जाते-जाते एक बार फिर से बड़ा शराब घोटाला करने की तैयारी में है।
पहले भी मैंने झारखंड में संभावित शराब घोटालों के बारे में चिंता व्यक्त की थी और मुख्यमंत्री जी को इस बारे में चेताया था, लेकिन उन्होंने नैतिकता को पूरी तरह… pic.twitter.com/yhtqoJZrPP
— Babulal Marandi (@yourBabulal) September 25, 2024
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!