లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి, సౌత్ గ్రూప్ లో ముఖ్య సభ్యుడు శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారుతున్నట్లు తెలిపాడు. దీంతో ఆయన రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. అప్రూవర్ గా మారుతున్నందుకు అనుమతివ్వాలంటూ కోరాడు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీగా లిక్కర్ అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటింది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైనట్టు ఈడీ ఆరోపణలు చేసింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.
మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు.