Health Benefits: ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ద పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద మార్గాల కోసం చూస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీరు త్రాగడం ఒకరకమైన అలవాటు అనవచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్ర లేచిన తరువాత కాదు.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరు నీరు తాగడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు మీ ఊహకు అందని విధంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణ సమస్యలన్నీ నయమవుతాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై ఉదయం పూట ఆహ్లాదకరమైన విరేచనాలు అవుతాయి. రోజులో ఎప్పుడైనా బరువైన ఆహారం తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
Read also: Lipstick: లిప్‌స్టిక్ రాస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు టచ్ చేయరు..
కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. కడుపు తేలికగా అనిపిస్తుంది. గోరువెచ్చని నీరు శరీరంలోని నాడీ వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో ఉదయం పూట వివిధ పనుల వల్ల ఎదురయ్యే ఒత్తిడి తగ్గి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతుంది. నిద్రలేమితో బాధపడేవారు గోరువెచ్చని నీళ్లు తాగి పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మహిళలు కూడా ఈ గోరువెచ్చని నీటితో బహిష్టు సమయంలో నొప్పిని చెక్ చేసుకోవచ్చు. రాత్రిపూట ఈ నీటిని తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగితే ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. గొంతునొప్పి సమస్య ఉంటే తగ్గుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది..