రాను రాను మానవ జీవన విధానం మారుతోంది. ఇది మనిషి జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం చూపుతోంది. ఇప్పుడు వయసులో ఉన్న చాలా మంది యువకులకు కనీసం సత్తువ తక్కువవుతోంది. మన తాతల కాలంలో ఒంటి చేస్తో 50 కేజీల వడ్ల బస్తా మోసే వాళ్లు. అలాంటి పరిస్థితి ఇప్పటి జనరేషన్ వాళ్లలో కనిపించడం లేదు. కాగా.. అయిదు పదుల వయసులు ఓ మహిళ సంచలనం సృష్టించింది.
READ MORE: Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
30 ఏళ్లకే అనేక రకాల నొప్పులతో బాధ పడేవారికి ఆదర్శంగా నిలిచింది. ఆమె పేరే గోలి శ్యామల. ప్రస్తుతం శ్యామల వయసు 52 ఏళ్లు. ఈ ఏజ్‌లో కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటు చాలా మంది వైద్యుల చుట్టు తిరుగుతారు. శ్యామల మాత్రం అలా కాదు.. తన రూటే సపరేటు.. ఈ వయసులో సముద్రంలో 150 కి.మీ. ఈదింది. గత నెల 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహసయాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న శ్యామల.. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ. ఈదింది. ఈ సందర్భంగా చాలా మంది ఆమెను అభినందించారు. ఆమె వెంట 14 మంది క్రూ సభ్యులు, వైద్యబృందం, స్కూబా డైవర్స్ ఉన్నారు.
READ MORE: 6th-generation fighter Jets: ఇండియా ముందు రెండు భారీ ఆఫర్లు.. ఇక చైనా, పాకిస్తాన్‌కి చుక్కలే..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను సామర్ల కోటలో పుట్టి పెరిగాను. మాది చిన్న రైతు కుటుంబం. కానీ.. ఈ రోజు స్విమ్మింగ్‌లో విశాఖ పట్నం నుంచి కాకినాడ వరకు వచ్చాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా రెండేళ్ల కల. ఎంతో కఠిన శ్రమ పడ్డాను. తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎంతో కఠినంగా మనసు, శరీరాన్ని నిగ్రహించుకుని, ఓ క్రమశిక్షణతో ట్రై చేశాను. రోజుకు పది నుంచి 20 కిలోమిటర్ల మేర స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేశాను. యోగా, జిమ్, స్విమ్మింగ్ చేస్తూ ఇది సాధించాను.” అని గోలి శ్యామల వెల్లడించారు.
READ MORE: Hyderabad: లాలాగూడలో విషాదం.. తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
“ఈ అప్పటి వరకు కూడా నేను భూమిపైకి రాలేదు.. ఓన్లీ బోట్‌లోనే ఉన్నా. స్విమ్మింగ్ చేసి బోట్‌లోకి వెళ్లాను.ఈ జర్నీలో నాకు ఒక్క రోజు మాత్రమే ఇబ్బంది కలిగింది. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ జర్నీలో ఎక్కడ చూసిన తాబేళ్లు కనిపించాయి. వాటిని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం తాబేళ్లు చనిపోయి డెడ్ బాడీస్ కనిపించాయి. మాకు చాలా బాధ అనిపించింది. వాటర్ చాలా కలుషితమైంది. ఓ కెమికల్ లాగా మారింది. ప్రభుత్వం దీనిపై స్పందించాలి. తాబేళ్ల రక్షణకు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా.” అని శ్యామల పేర్కొన్నారు.