ఎయిర్ కండీషనర్ అనేది ఒకసారి కొన్నది చాలా కాలం పాటు ఉపయోగించబడుతుంది. అందుకే మన అవసరాలకు తగినట్లుగా సరైన యూనిట్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దాని పనితీరును ఎక్కువ కాలం కొనసాగించడానికి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనితో పాటు ఎయిర్ కండీషనర్‌ను మార్చడానికి సమయం ఆసన్నమైందో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యం.
కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. కొలెస్ట్రాల్ మీ రక్తంలో కనిపించే మైనపు పదార్థం. మీ కాలేయం కొలెస్ట్రాల్‌ను స్వయంగా తయారు చేస్తుంది లేదా మీరు తినే, తాగే వాటి నుంచి అది పేరుకుపోతుంది. శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ దాని స్థాయి పెరిగినప్పుడు, అది అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది
శరీరంలోని వివిధ సమస్యలకు వివిధ యోగా ఆసనాలు చేస్తారు. కానీ సూర్య నమస్కారం అనేది అనేక యోగా ఆసనాలను కలిగి ఉంది. ప్రతిరోజూ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
మనకు తెలిసిన స్నేహితులు డేటింగ్, ఒకరినొకరు ప్రేమించుకోవడం చూసినప్పుడు ఆ ఆలోచన ఎవరి మనస్సులోనైనా రావచ్చు. 'డ్యూడ్, నేను కూడా డేటింగ్ చేయాలనుకుంటున్నాను' లేదా 'నేను కూడా సంబంధంలోకి రావాలనుకుంటున్నాను' అని చాలా సార్లు చాలా మంది చర్చించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఎవరితోనైనా డేటింగ్, రిలేషన్‌షిప్‌లోకి రావాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
రాత్రి త్వరగా తినాలని ఎప్పటికప్పుడు పెద్దలు చెబుతూనే ఉంటారు. కాని మన పరిస్థితులు, పని చేసే కార్యాలయాల్లోని టైమింగ్స్ కారణంగా రాత్రి లేట్ గా భోజనం చేస్తుంటాం. వీలైనంత వరకు రాత్రి 7 గంటలలోపే తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏమీ తోచదు. చేసే పనిమీద ఏకాగ్రత పెట్టలేం. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆరోగ్యానికి కారణమవుతుంది. నిద్రకోసం కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అది ప్రమాదకరం. హాయిగా నిద్రపోవడం ఒక అద్భుతమైన అనుభూతి.
గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం అనేది మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ మాత్రలు వేసుకుంటే గర్భం రాకుండా ఉండటమే కాదు, హార్మోన్లలో మార్పులను కూడా ప్రేరేపిస్తుందట. ఈ మాత్రను శరీరం లోపలికి వెళ్లి గర్భం రాని విధంగా హార్మోన్లలో మార్పులు తీసుకొచ్చే విధంగా తయారు చేస్తారు. శరీరం లోపల జరిగే ఈ మార్పులను నిర్వహించడం కొంతమంది స్త్రీలకు చాలా కష్టంగా ఉంటుంది. వారు మానసికంగా చితికిపోతారు.
పంచదార అన్న పదం వినగానే నోట్లో నీళ్ళూరుతాయి. ముఖ్యంగా చిన్నతనంలో పంచదారను ఎక్కువగా తింటుంటాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సాధారణంగా తీపి పదార్ధాల రుచిని ఇష్టపడతారు. కానీ చిన్న పిల్లలకు చక్కెర ఇవ్వడం వారి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.