మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వరుసగా చీతాలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 8 చీతాలు మృతిచెందగా.. తాజాగా మరో చీతా కన్నుమూసింది. ఆ చీతా పేరు ధాత్రి. దాని ఆఫ్రికా నామధేయం తిబ్లిసి. అయితే కునో అభయారణ్యంలో చీతా చనిపోయి ఉండగా అధికారులు ఉదయం గుర్తించారు.
అయితే చిరుతపులి జింకను ఏ విధంగా తెలివితో మాటేసి వేటాడిందో ఈ వీడియోలో చూడండి. జింక ఎవరూ లేరని ధైర్యంతో గడ్డిని తింటుండగా.. చిరుతపులి మెల్ల మెల్లగా జింకపైనే కన్ను వేస్తూ ఎలా వస్తుందో మీరు చూడవచ్చు. జింకను వేటాడేందుకు చిరుతపులి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. తెలివితో నక్కి నక్కుకుంటూ వెళ్లి జింకపై దాడి చేస్తుంది.
పులిని చూస్తే భయపడి ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది చిరుత పులే మనపై దాడి చేస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ తనపైకి దాడికి వచ్చిన చిరుత పులితో పోరాడి.. ఆ చిరుతనే బంధించాడో వ్యక్తి్.
ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేశారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్ చేస్తున్నారు. ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది.
Cheetah in Jeedimetla: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అపురూప కాలనీలో చిరుత గుమికూడుతున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది.
Dog Resembling a Leopard: మనుషుల పోలిన మనుషులే ఉండడం సర్వ సాధారణమైన విషయం.. ఇక, జంతువులను పోలిన జంతువులు కూడా ఉంటాయి.. కానీ, అవి ఒకే జాతికి చెందినవే ఉంటాయి.. కొన్నిసార్లు మాత్రం.. భిన్నమైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి.. ఇదంతా ఎందుకు? అంటారా? పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో చిరుత యద్దేచ్ఛగా తిరిగేస్తుంది.. తెలియని వారిని చూసి బెదిరించే ప్రయత్నం చేస్తుంది.. ఇక, పాతవారుంటే మాత్రం ఏమీ పట్టనట్టుగానే వారి మధ్యలో తిరిగేస్తుంది.. యజమాని సమయానికి…
జార్ఖండ్‌లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) బుధవారం తెలిపారు.