Leopard: చిరుతను తాడుతో బైకుకు కట్టి.. ఫారెస్ట్ ఆఫీసుకు తీసుకెళ్లిన రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard: పులిని చూస్తే భయపడి ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది చిరుత పులే మనపై దాడి చేస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ తనపైకి దాడికి వచ్చిన చిరుత పులితో పోరాడి.. ఆ చిరుతనే బంధించాడో వ్యక్తి్. చిరుతను బంధించి తాడుతో కట్టి.. తన బైక్‌పై అటవీ శాఖ ఆఫీస్‌కు వెళ్లి అధికారులకు అప్పగించి వచ్చాడు ఆ వ్యక్తి. కర్ణాటకలోని హసన్ జిల్లా బాగివాలు గ్రామానికి చెందిన ముత్తు అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి 9 నెలల వయస్సున్న చిరుత పులి ఎదురుపడింది. మరి అది ఊకుంటుందా.. అతడిపై దాడికి దిగింది. అయితే తానేం తక్కువ అనుకున్నాడో ఏమో.. దానిపై ఎదురుదాడి చేశాడు. తన వద్ద ఉన్న తాడుతో దానిని బంధించాడు. దాని కాళ్లను తాడుతో కట్టేశాడు. చిరుతను తన బైక్‌కు వెనక కట్టుకుని ఏకంగా అటవీ ఆఫీస్‌కు తీసుకెళ్లి అధికారులకు అప్పజెప్పాడా రైతు.
Read also: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు రైల్వే అధికారులు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
రైతు చిరుత పులిని తాడుతో బంధించి బైక్‌పై తీసుకురావడాన్ని చూసి విస్తుపోయిన సిబ్బంది వెంటనే దానిని దవాఖానకు తరలించారు. చిరుత దాడిలో రైతు ముత్తు స్వల్పంగా గాయపడ్డాడు. చిరుత పులి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అవగాహన రాహిత్యంతోనై రైతు అలా చేశాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. అతనికి మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులు రైతుకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత వదిలేసినట్లు పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని రైతుకు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిపై దాడి చేసి.. దానిని తాడుతో కట్టేశానని ముత్తు తెలిపాడని అధికారులు చెప్పారు. తనకు చిరుతను చంపాలనో.. మరో ఉద్దేశం ఏమీలేదని రైతు స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!