అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు, ఎలుగుబంట్ల, ఏనుగులు జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులుల అలజడి జనానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ చిరుత పులి అలజడి కలిగిస్తోంది. గాలివీడు మండలం అరవీడు గ్రామం నడింపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులి హల్ చల్ చేసింది. మేతకు అడవికి వెళ్ళిన మేకల మంద పై దాడి చేసి రెండు మేకలను చంపింది చిరుత పులి. దీంతో ప్రాణ భయంతో అటవీ ప్రాంతం నుంచి…
ఎట్టకేలకు బావిలో పడిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లా హిందోల్ ఘాట్ లో చోటు చేసుకుంది. హిందోల్ ఘాట్ సమీపంలోకి మంగళవారం ఈనెల 7న సాయంత్రం వచ్చిన చిరుత ఉన్నట్లుండి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావి నుంచి బయటకు వచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించింది. అయితే.. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. అటువైపుగా…
పిల్లలను కనడమే కాదు.. వారిని కంటికి రెప్పలా కాపాడడంలో తల్లిని మించినవారు లేరు… అవసరమైతే తన ప్రాణాలను పనంగా పెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.. తన మూడేళ్ల కూతురుని చిరుత నుంచి కాపాడుకోవడానికి ఓ తల్లి చూపిన ధైర్యం, చిరుతపై చేసిన పోరాటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. తల్లీ నీకు వందనాలు.. నీ ధైర్యానికి పాదాభివందనాలు అంటున్నారు.. ఇక, మహారాష్ట్రలో తాజాగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన పూర్తి…
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్ యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు అధికంగా నెటిజన్లు లైక్ చేస్తుంటారు. సింహం పులి పోటీ పడటం, పాము ముంగీస వంటివి ఫైట్ చేసుకోవడం వంటి వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు కొండ చిలువ, చిరుతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఓ చెరువు దగ్గర ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు కొండచిలువ కనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ…
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అనే సాంగ్ గుర్తుంది కదా…అలానే పాపం ఓ చిరుత పులి బద్లాపూర్ జిల్లా గోరెగాన్ ప్రాంతంలోకి వచ్చింది. అడవిలోనుంచి వచ్చిన సంవత్సరం వయసున్న చిరుతపులి వాటర్ క్యాన్‌లో ఏదో ఉందనుకొని తల దూర్చింది. తలైతే దూరిందికానీ ఆ తలను వెనక్కి ఎలా తీయాలో అర్థం కాలేదు. దీంతో పాపం ఆ చిరుత నానా కష్టాలు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 మంది కలిసి 48…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పిల్లి పల్లి అనే గ్రామంలో చిరుత సంచరిస్తునట్టు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలెర్ట్ చేసామన్నారు. రాత్రి సమయంలో ఊరిలో చాటింపు వేసి ఇళ్ల నుండి ప్రజలను బయటికి రావొద్దు అని చెప్తున్నాం.. రాత్రి సమయంలో పెట్రోలింగ్ వెహికిల్స్ ను ఉంచామన్నారు. చిరుత కనిపిస్తే వెంటనే డయల్100 కి కాల్ చేయాలి…
కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే వెనుకవైపు ఉన్న ధ్వజస్థంబం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్నకుక్కపిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎగువ అహోబిలం ఆలయంలోని రామానుజాచార్యుల మండపం వద్ద కుక్కపిల్లలు ఉన్నాయని ఎలా పసిగట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే, రెండు మూడు…
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో వన్యమృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ ఖాళీగా మారిపోవడంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చాయి. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాల రద్దీ పెరిగింది. దీంతో వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం తగ్గిపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతున్నది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. Read:…
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది. ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన…