ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని…
తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.…
చిరుతపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహేగాం మండలం లోహ శివారులో పులి సంచారం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మూడు వాగుల వద్ద కార్తిక స్నానానికి వెళ్ళిన 20 మంది భక్తులు పరుగులు తీశారు. వారికి పులి ఎదురుపడింది, పులి కదలకపోవడంతో అక్కడే ఆగిపోయారు భక్తులు. పులి కనిపించిన సమాచారాన్ని ఊరిలో ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారంతా కదిలి వచ్చారు. గ్రామస్తులు డప్పులు వాయిస్తూ వెళ్ళడంతో పులిక పారిపోయింది. పులి కనిపించిన సమాచారాన్ని అటవీశాఖ…
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్…
ముంబై శివారు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుతలు దాడులు చేస్తున్నాయి. నిన్న కూడా ఓమహిళపై చిరుత దాడిచేసింది. అయితే, ఆ మహిళ చిరుతపై దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. చేతి కర్ర సాయంతో చిరుతపై తిరగబడింది. కర్ర దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. నడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిన మహిళ ఇంటి వసారాలో కూర్చున్నది. అప్పటికే మూలన నక్కి ఉన్న చిరుత ఆ మహిళపై దాడిచేసింది. మహిళ అప్రమత్తంగా ఉండటంతో చిన్న…
మనం పది అడుగుల ఎత్తు నుంచి కిందపడితే కాలో చేయో ఇరిగిపోతుంది. అలాంటిది ఓ ఎత్తైన పర్వతం నుంచి కిందపడినా దానికి ఏమీ కాలేదు. పైగా పట్టువదలని విక్రమార్కునిలా నోటికి చిక్కిన వేటను వదలకుండా పట్టుకుంది. మామూలుగా చిరుతలకు ఆహరం దొరికితే అసలు వదలవు. ఇక మంచు కొండల్లో వాటికి వేట దొరకడమే చాలా కష్టం. అలాంటిది దొరికితే వదులుతాయా చెప్పండి. మంచు చిరుతకు ఓ జింక కనిపించింది. వేటాడేందుకు చిరుత దూకగా అది తప్పించుకునే ప్రయత్నం…
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు… ఓ చిరుత స్కూల్ క్యాంటిన్‌లోకి దూరింది. విషయం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు, వైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవిశాఖాధికారలు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి చిరుతను బందించి అడవిలో వదిలేశారు. Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ? చిరుతకు గాయాలు కావడంతో అది క్యాంటిన్‌లోకి వచ్చి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి…
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అయితే నిన్న శ్రీవారిని 17,736 భక్తులు దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు సమర్పించారు 7,838 మంది భక్తులు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం1.6 కోట్లుగా ఉంది. ఇక ఇదిలా ఉంటె తిరుమల సన్నిదానం అతిధి గృహం వద్ద చిరుత హల్ చల్ చేసింది. అడవిపందిని నోటికీ కర్చుకొని చిరుత సన్నిదానం అతిధి గృహం సెల్లార్ వద్దకు వచ్చింది. చిరుతను…