Leopard Attack: తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది.. తిరుపతి-తిరుమల నడకమార్గంలో బాలుడిపై దాడి చేసింది.. ఎత్తుకెళ్లింది.. ఏడో మైలు వద్ద ఈ ఘటన జరిగింది.. తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. ఎత్తుకెళ్లింది. అయితే, ఈ ఘటనను గమనించిన సమీపంలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులు.. గట్టిగా కేకలు వేశారు.. దీంతో.. భయంతో బాలుడ్ని వదిలేసి అడవిలోకి పారిపోయింది చిరుత.. ఈ ఘటనలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనతో నడకదారిలో వెళ్లే భక్తులు భయంతో వణికిపోతున్నారు.. నిత్యం వేల సంఖ్యలో భక్తులు నడకమార్గంలో తిరుమల చేరుకుంటారు.. ఈ ఘటనలో నడకమార్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది.. ఇక, టీటీడీ నడక మార్గంలో అదనపు సిబ్బందిని రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది.