ఇంటర్నెట్ ప్రపంచంలో జంతువులకు సంబంధించిన వీడియోలను వినియోగదారులు చాలా ఇష్టపడతారు. ఇలాంటి జంతవులకు సంబంధించిన వీడియోలు చూడటమే కాకుండా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కూడా. ఇతర వీడియోల కంటే ఇలాంటి వీడియోలపై కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కారణం ఏంటంటే.. మనం ఈ జంతువులతో చాలా దగ్గరగా ఉండకపోవడం మరియు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు.. మన కళ్ళు వాటిపైనే ఉండటం, మన చేతులు కూడా ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. అయితే అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు.
Realme C 53: కెమెరా లవర్స్ కు గుడ్ న్యూస్..రియల్ మీ నుంచి స్మార్ట్ ఫోన్ లాంచ్.
అడవిలో చిరుత పిలులు ఎలా ఉంటాయో మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, వింటూంటాం. పులులకు సంబంధించి ఏదైనా జంతువు గర్జిస్తే, అడవి మొత్తం నిశ్శబ్దం అవుతుంది. పులులకు ఎంత పెద్ద జంతువునైనా ఇట్టే మట్టికరిపిస్తాయి. ఆకలైందంటే వేటాడి చంపుకుని తింటాయి. అయితే వేటాడేటప్పుడు ఎంత బలాన్ని ఉపయోగిస్తాయో.. సమయం వచ్చినప్పుడు తన మెదడును కూడా అలానే ఉపయోగిస్తుంది. అయితే చిరుతపులి జింకను ఏ విధంగా తెలివితో మాటేసి వేటాడిందో ఈ వీడియోలో చూడండి. జింక ఎవరూ లేరని ధైర్యంతో గడ్డిని తింటుండగా.. చిరుతపులి మెల్ల మెల్లగా జింకపైనే కన్ను వేస్తూ ఎలా వస్తుందో మీరు చూడవచ్చు. జింకను వేటాడేందుకు చిరుతపులి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. తెలివితో నక్కి నక్కుకుంటూ వెళ్లి జింకపై దాడి చేస్తుంది. ఈ షాకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో rizal.rayan_ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను లక్ష మందికి పైగా చూసి లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. చిరుతపులి చురుకుదనాన్ని కొనియాడుతున్నారు.