Madras High Court: భార్యలు పోర్న్ చూడటం విడాకులకు కారణం కాదని, వివాహం చేసుకున్న తర్వాత మహిళలు హస్త ప్రయోగం చేసుకునే హక్కును కలిగి ఉంటారని, వారి లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడులో ఒక వ్యక్తి దిగువ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో బుధవారం న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tapsee : బాలీవుడ్ చిత్రాలతో నెట్టుకొస్తున్న బ్యూటీ
సదురు వ్యక్తి తన భార్యపై అనేక క్రూరత్వ చర్యల ఆరోపణలతో విడాకులు కావాలని కోరాడు. ఇందులో ఆమె అశ్లీల వీడియోలు చూస్తూ, హస్తప్రయోగానికి బానిసైందని పేర్కొన్నాడు. అయితే, హైకోర్టు ఈ అప్పీల్‌ని తోసిపుచ్చుతూ.. ‘‘స్వీయ ఆనందం నిషిద్ధం కాదు’’ అని తీర్పు చెప్పింది. పురుషుల్లో హస్త ప్రయోగం సార్వత్రికమైందని అంగీకరించబడినప్పుడు, మహిళలు చేసే హస్తప్రయోగం కళంకం కాకూడదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒక మహిళ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుందని, ఒక వ్యక్తిగా, ఒక మహిళ ఆమె ప్రాథమిక గుర్తింపుని ఆమె జీవిత భాగస్వామి హోదా ద్వారా లొంగిపోదు అని వ్యాఖ్యానించింది. అశ్లీల చిత్రాలను వ్యవసంగా చెడ్డది, నైతికంగా సమర్థించలేమని, కానీ విడాకులకు చట్టపరమైన ఆధారం కాదని కోర్టు పేర్కొంది.