అందాల ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఇలియానా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సినీరంగానికి దూరంగా ఉంటోంది. 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది.
READ MORE: Delhi Chief Minister: ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
కాగా.. ఇలాయానా మళ్లీ తల్లికాబోతోందని రూమర్స్ వినింపించాయి. ఆమె ఓ టెస్ట్ కిట్ వీడియోను పోస్ట్ చేయడంతో ఇవి మొదలయ్యాయి. ఈ రూమర్స్ కి నటి చెక్ పెట్టింది. నిజంగానే ఇప్పుడు తాను గర్భవతి అని తెలిపింది. మరోసారి తల్లి కాబోతునట్లు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. పఫ్ కార్న్ స్నాక్స్, యాంటాసిడ్ చుయింగమ్ ప్యాకెట్స్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాలి అని రాసుకొచ్చింది. అంటే పరోక్షంగా తాను గర్భావతి అని చెప్పినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసు విచారణ ముమ్మరం చేసిన ఏపీ పోలీసులు..