యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ఎంతో కీలకమైన కలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించారు. బాలివుడ్‌లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పంకజ్ దగ్గరయ్యారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పంకజ్ త్రిపాఠీ బాలివుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంకజ్ త్రిపాఠి తన బాల్యం, బీహార్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి సినిమా వరకు తన ప్రయాణం వంటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ప్రేక్షకులు బాలీవుడ్‌తో కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణాన్ని వివరించారు. ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోయే కథలను తెరకెక్కించడంలో బాలీవుడ్ విఫలమైందన్నారు.
READ MORE: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
‘మనం గ్రౌండ్ లెవల్ కథలను చూపించకపోతే ప్రజలు మన సినిమాలతో ఎందుకు కనెక్ట్ అవుతారు?’ అని అన్నారు. “90ల, అంతకు ముందు తీసిన సినిమాల్లో ఒక మాయాజాలం ఉండేది. వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. ఆ చిత్రాలను కుంటుంబ మొత్తం కలిసి చేసేవారు. అదే స్థాయిలో ఆనందించే వారు. పాత్రల్లో నటించిన వాళ్లు ఏడిస్తే.. ప్రేక్షకులు కూడా ఏడ్చే వాళ్లు.. నటులు నవ్వితే వాళ్లు కూడా నవ్వుకునేవాళ్లు. కానీ ఆ మ్యాజిక్ ఇప్పటి కథల్లో లేదు. కేవలం వినోదం కోసం మాత్రమే చూస్తున్నారు. పాత్రలతో కనెక్ట్ కావడం లేదు. తమకు సంబంధించిన వారి కోసం సినిమాలు చూస్తున్నారు. వారు సినిమాల్లో, నటుల్లో తమ మూలాలు వెతుకుతున్నారు. కథలో ప్రేక్షకులకు కనెక్ట్ అయితే.. ఎన్ని సార్లు విడుదలైనా ప్రేక్షకాదరణ అలాగే ఉంటుంది. దానికి ఉదాహరణ.. నేను నటించిన ‘బరేలీ కీ బర్ఫీ’ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకాదరణ పొందింది.” అని నటుడు పంచజ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
READ MORE: Hyderabad Chicken Sales: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన చికెన్ అమ్మకాలు!
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పంకజ్ ‘స్త్రీ’ సినిమా గురించి కూడా మాట్లాడారు. “‘స్త్రీ’ ఒక జనర్ హర్రర్ సినిమా. ఇది సినిమా గొప్ప విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత జానర్‌లో ఎన్నో సినిమాకు వచ్చాయి. ఈ సినిమాలకు చూసి జనాలు భయపడకుండా నవ్వుకున్నారు.” అని పంకజ్ వ్యాఖ్యానించారు.