పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ఓ మైనర్ తన తండ్రిని పైపుతో కొట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న 50 ఏళ్ల వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Man swallows keys: బీహార్ మోతిహారికి చెందిన ఓ వ్యక్తి తాళంచెవి, కత్తి, రెండు నెయిల్ కట్టర్‌ని మింగేశాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు అతడి కుటుంబం నిరాకరించడంతో ఈ చర్యకు ఒడిగట్టాడు. పరిస్థితి తీవ్రంగా మారడంతో అతనికి వైద్యులు 1.5 గంటల పాటు శస్త్రచికిత్స చేసి, కడుపులో ఉన్న వస్తువుల్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన లఖ్‌పతి దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త తన భార్యను చంపించాడు. ఈ హత్యలో యువకుడి స్నేహితుడు కూడా అతనికి సహకరించాడు. భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కళ్ల ముందే భార్యను స్నేహితుడి చేతిలో హత్య చేయించినట్లు సమాచారం.