హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ ను నిలిపేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది. సుదీర్ఘ వారంతపు సెలవుల( లాంగ్ వీకెండ్) కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.
పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం శనివారం ఉదయం పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకి మరణించిన విషయం తెలిసిందే.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్‌పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదమం.. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నేపాల్ తనహున్ జిల్లాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అబుఖైరేని ప్రాంతంలోని మర్స్యంగ్డి నదిలో భారతీయ ప్రయాణీకుల బస్సు పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 14 మంది ప్రయాణికులు మృత్యువు ఒడికి చేరుకున్నారు.
బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధి రేటును ఈ నెలాఖరులో ప్రకటించనున్నారు. ఈ ప్రకటనకు ముందు రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) భారతదేశ వృద్ధి రేటుకు సంబంధించిన అంచనాను తెలిపింది.