Crime: షాపింగ్ కి విపరీతంగా డబ్బు ఖర్చు చేసిన భార్య.. సుపారీ ఇచ్చి చంపించిన భర్త
- షాపింగ్ కి విపరీతంగా డబ్బు ఖర్చు చేసిన భార్య
- భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం
- కారుతో గుద్దించి హత్య చేయించిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త తన భార్యను చంపించాడు. ఈ హత్యలో యువకుడి స్నేహితుడు కూడా అతనికి సహకరించాడు. భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కళ్ల ముందే భార్యను స్నేహితుడి చేతిలో హత్య చేయించినట్లు సమాచారం. షాపింగ్ కు విపరీతంగా డబ్బులు ఖర్చుచేస్తుందనే కారణంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
READ MORE: Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 13న విక్కీ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లోడింగ్ వాహనం ఢీకొనడంతో మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న దుర్గావతి అనే మహిళ మృతి చెందగా, మోటారు సైకిల్ నడుపుతున్న దుర్గావతి సోదరుడు సందేశ్‌కు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని దుర్గావతి భర్త అజయ్ భార్గవ పోలీసులకు తెలిపాడు. గుడికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు అజయ్ పేర్కొన్నాడు. అప్పట్లో పోలీసులు కూడా ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 11 రోజుల తర్వాత ఇప్పుడు పోలీసులకు అసలు విషయం తెలిసింది. పోలీసులు ప్రమాద స్థలం చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఫుటేజీలో లోడింగ్ వాహనం కనిపించలేదు. అయితే.. సందేశ్, దుర్గావతి ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్ వెనుక ఎకో స్పోర్ట్ కారు కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
READ MORE:Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బైక్ ను ఢీకొట్టింది లోడింగ్ వెహికల్ లా కాదా అని అజయ్ కి పోలీసులు అడిగారు. దీనిపై అజయ్ మాట్లాడుతూ.. అది కారు కూడా కావచ్చని అనుమానాస్పదంగా సమాధానం చెప్పాడు. ఇక్కడి నుంచి అజయ్‌పై పోలీసులకు అనుమానం బలపడింది. దీంతో పోలీసులు అజయ్ జాతకాన్ని పరిశీలించడం ప్రారంభించారు. దుర్గావతిని అజయ్ రెండో భార్య అని పోలీసుల విచారణలో తేలింది. దుర్గావతితో కూడా అజయ్ ప్రేమ వ్యవహారం నడిపాడు. 2017 సంవత్సరంలో ఇరువురు పరిచయమ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే 2021లో దుర్గావతి వేరే పెళ్లి చేసుకుంది.
READ MORE: Harish Shankar: మీతో మరో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. విశ్వప్రసాద్ కి హరీష్ శంకర్ ట్వీట్
అజయ్ కూడా 2022లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ తమ తమ జీవితాల్లో బిజీగా మారారు. కానీ అజయ్ వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, దుర్గావతి తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చింది. మరోసారి దుర్గావతి, అజయ్ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇరువురు 2023లో వివాహం చేసుకున్నారు. దీని తర్వాత ఇద్దరూ పడవ్ ప్రాంతంలోని సాకేత్ నగర్‌లో నివసించడం ప్రారంభించారు. తన రెండవ భార్య దుర్గావతి అతి ఖర్చు చేస్తుండటం అజయ్ కి నచ్చలేదు. దీని వల్ల అతడి ఆర్థిక పరిస్థితి దిగజారింది. కోపంతో తనను చంపేందుకు కుట్ర పన్నాడు. అతడి మిత్రునికి రూ.2.5 లక్షలు ఇచ్చి భార్యను హత్య చేయించాడు.
తాజావార్తలు
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!