ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
భారత ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గురువారం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం 156 ఎఫ్‌డిసిలను (ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్) తక్షణమే నిషేధించింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు రైలులో వెళ్లనున్నారు. అది యుద్ధ ప్రాంతం కావడంతో ప్రధాని మోడీ ఈ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత ప్రధాని దేశం నుంచి వెళ్లినప్పుడల్లా ఆయన భద్రతకు ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా? విదేశీ పర్యటనలో ప్రధాని మోడీకి భద్రత యొక్క ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… భారత ప్రధాని భద్రత బాధ్యత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)పై ఉంది.…
మీరు చాలా రకాల సెలూన్‌లను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మోటార్ సైకిల్‌పై సెలూన్‌లను చూశారా?.. ప్రస్తుతం బార్బర్లు కూడా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక్క కాల్ చేస్తే ప్రతిదీ అందుబాటులోకి వచ్చనట్లే సెలూన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
కోల్‌కతా అత్యాచారం-హత్య కేసులో బాధితురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు షాకింగ్ వాదనలు చేశారు. తమ కుమార్తెను హత్య చేసేందుకు నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఎవరో పంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. కోల్‌కతా పోలీసులకు చెందిన సంజయ్ రాయ్‌ను ఆగస్టు 10న అరెస్టు చేశారు.
కార్మికులు కష్టానికి కేంద్ర ప్రభుత్వం కరిగింది. పలు రంగాలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర తాజాగా ఈ-శ్రమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన e-SHRAM పోర్టల్‌ను ప్రారంభించింది.
అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్‌పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్‌లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు.
తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివిధ గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రోవిజినల్(తాత్కాలిక) జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్ ల కోసం పాత ఫోన్లను వాడుతున్నారని పోలీసులు గుర్తించారు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్ ఇచ్చి ఫోన్లు కొంటున్నారు.