దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఇటీవల సభలో చంద్రబాబు మైక్ కట్ చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు టీడీపీ సభ్యులు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీ స్పీకర్ సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించినట్లు…
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది. Read Also:…
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో తాను మాట్లాడినట్లు తెలిపాడు. ఆయన రెండో కుమారుడు అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. Read Also: గ్రీన్ ఇండియా…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఆరు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో ఒక్కో స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. Read Also: మహిళతో రాసలీలలు… అడ్డంగా దొరికిపోయిన వనపర్తి ఎస్సై రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు… మహబూబ్‌నగర్ జిల్లా…
సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ పోలీస్ రాసలీలలు బహిర్గతం అయ్యాయి. వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ కొత్తపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మహిళ భర్తకు తెలిసిపోయింది. దీంతో ఎస్సై షఫీని, తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. మహిళ భర్త ప్లాన్‌కు అతడి స్నేహితులు కూడా సహకరించారు.…
శుక్రవారం నాడు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అంశాలపై గతంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్‌డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకుని బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం…
శుక్రవారం నాడు ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ జకీయా ఖానమ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తొలిసారిగా మైనారిటీ మహిళకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ పదవి దక్కనుంది. Read Also: అమెజాన్‌లో అమ్మకానికి ‘విషం’… ఎఫ్ఐఆర్ నమోదు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. జకీయా ఖానమ్‌కు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వడం హర్షదాయకమన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మళ్లీ రచ్చ మొదలైంది. మా ఎన్నికలు జరిగి నెలరోజులు దాటినా.. కొత్త ప్యానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్గం నటీనటులు ఆరోపిస్తున్నారు. మా కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా మూసిఉంటోందని.. దాంతో తాము నిరాశగా వెనుతిరగాల్సి…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతుండటంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌ను మరో వివాదం చుట్టుకుంది. దీంతో అమెజాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం (సల్ఫాస్ ట్యాబ్లెట్లు) కొనుగోలు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు…