కరోనా కారణంగా గతంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వారికి మరో కష్టం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు వీరిని ఆదుకోవాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. Read Also: ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే వాయు కాలుష్యం కారణంగా భవన నిర్మాణ పనులు ఆపి…
ప్రముఖ సామాజిక సేవా కర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే అస్వస్థతకు గురికావడంతో గురువారం నాడు ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఛాతి నొప్పితో బాధపడుతుండటంతో హజారే పూణెలోని రుబె హాల్ క్లినిక్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ మేరకు అన్నా హజారేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెలోని కరోనరీ ఆర్టెరీలో ఏర్పడిన బ్లాకేజీని తొలగించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి మెడికల్…
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని లుంబిని పార్క్ వద్ద ఉండే పాత సచివాలయాన్ని కూలగొట్టి ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని నిర్మిస్తోంది. అయితే సచివాలయం నిర్మాణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై మండిపడింది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. Read Also: సింగరేణిలో…
కస్టమర్లను ఆకర్షించడానికి పలువురు సరికొత్త ఆఫర్లను ప్రకటించి ఊరిస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో బిజినెస్‌లో నెగ్గుకురావాలంటే ఆఫర్లను ప్రకటించడం, డిస్కౌంట్లు ఇవ్వడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్‌లో ఓ రెస్టారెంట్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. Read Also: దొంగ బాబా కామ క్రీడలు.. మంత్రాల పేరు చెప్పి అక్కాచెల్లెళ్లపై… భాగ్యనగర్‌లోని రేణు గ్రాండ్ రెస్టారెంట్ నిర్వాహకులు రూ.99తో బిర్యానీ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓ లక్కీ కూపన్ అందిస్తున్నారు.…
దేశంలో దొంగ బాబాల గురించి నిత్యం వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు బాబాల మీద నమ్మకంతో వారిని ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ దొంగబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు చాంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ బాబా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు…
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బుధవారం రోజు ఐఎస్ఐఎస్ కాశ్మీర్ పేరుతో ఓ బెదిరింపు ఈమెయిల్ రాగా.. గురువారం కూడా ఓ ఈమెయిల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా వచ్చిన బెదిరింపులో ‘నిన్ను చంపాలనుకుంటున్నాం… నిన్న బతికిపోయావ్.. బతుకు మీద ఆశ ఉంటే రాజకీయాలను, కాశ్మీర్ అంశాన్ని వదిలేయ్’ అంటూ ఈ మెయిల్‌లో ఉందని గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Read Also: వైద్యం ఖర్చు రూ.వెయ్యి…
కొత్తగూడెంలోని సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. కార్మికుల డిమాండ్లు ఏంటంటే… కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవడం, అన్‌ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, కార్మికుల అలియాస్ పేర్లను మార్చడం, ఏడాది…
సాధారణంగా ఇంట్లో విలువైన వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ కర్నూలు జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో ఈ ఘటన జరిగింది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ను తోటి విద్యార్థులు దొంగతనం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పెన్సిల్‌ను దొంగతనం చేసిన విద్యార్థిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. Read Also: ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా…
వివాహం జరిగి 24 గంటలు కాకముందే ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం నాడు వరుడు మృతి చెందగా.. గురువారం నాడు వధువు ప్రాణం కోల్పోయింది. దీంతో పెళ్లి జరిగిన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లో వెళ్తే… హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళికి ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దల…
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై హీరో జూ.ఎన్టీఆర్ కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్తూ ఓ వీడియో విడుదల చేశాడు. అయితే జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. Read Also: కాస్ట్ విషయంలో క్లారిటీ లేని నేత ఎవరు..? కొడాలి నాని, వల్లభనేని…