మూడు రాజధానుల రద్దుపై హైకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం నాడు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అంశాలపై గతంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్‌డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకుని బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Also: నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి
Also Read
ఈనెల 22న వికేంద్రీకరణ బిల్లుపై అభిప్రాయం చెప్పాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అఫిడవిట్‌లను దాఖలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్‌లతో జతచేసి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ హైకోర్టుకు సమర్పించారు. ఈ చట్టాలను అసెంబ్లీలో ఉపసంహరించుకున్నట్లు మాత్రమే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించారు కాబట్టి తగు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!