బంగ్లాదేశ్‌పై భారత్‌కు గొప్ప ఆరంభం లభించింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. అయితే సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ సెంచరీ చేశాడు.
కాకినాడ సినిమా రోడ్డులో చోరీ ఘటన చోటుచేసుకుంది. చందాకి వచ్చి మత్తు మందు చల్లి 50 గ్రాములు బంగారం చోరీకి పాల్పడ్డారు కేటుగాడు.. మంజు శ్రీ అనే మహిళ భర్త బయటకు వెళ్లగా, పిల్లలు సెలవులకు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది.
సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (SRDS) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
కెనడాలో ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు దాని ముందు బారులు తీరిన వీడియోని చూస్తే, పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల కోసం వరసలో ఉ
ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయారు. అపోస్మత్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేతలు కూడా మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారిలో, కామలేశ్, రామకృష్ణ,నీతి నందు ఉన్నట్లుగా గుర్తించారు.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది.
UP Shocker: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో విషాదకర సంఘటన జరిగింది. పిల్లలు బెలూన్లతో సరదాగా ఆడుకుంటారు, అయితే ఈ బెలూన్ 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. బాలిక బెలూన్‌తో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఆమె మరణించింది. పేలిన బెలూన్ బాలిక గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు విడిచింది.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న కుటుంబాలను బాధితులను పరామర్శించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను స్వయంగా కలిసి, వారి గోడును ఆవేదనను విన్నారు.
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. "స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి.