Shocking: ఆగ్రాలో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారి అయిన భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌజ్‌లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తన భర్త దీనదయాళ్ దీప్‌తో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని మహిళ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
సోషల్ మీడియా వినియోగదారులు తమ నగరాల్లో ఫ్లాట్‌లు, 1ఆర్‌కే (ఒక గది మరియు వంటగది) లేదా సింగిల్ రూమ్‌ల అద్దెల గురించి చర్చిస్తుంటారు. కొన్ని పోస్ట్ లు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చారు.
ఉత్తరాఖండ్‌లోని మున్సియారీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం తర్వాత కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేయబడింది.
ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నామన్నారు.
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో నూతనంగా ఏర్పాటు అవుతున్న ఫాక్స్ కాన్ కంపెనీ పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
లోకల్ బాడి ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.