Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. “వెయిటర్” ఉద్యోగం కోసం బారులు..
- వెయిటర్ ఉద్యోగాల కోసం బారులు తీరిన భారత విద్యార్థులు..
- కెనడాలో ఉద్యోగ సంక్షోభానికి అద్దం పడుతున్న పరిస్థితి..
- కేవలం 60 ఉద్యోగాలకు 3000 మందికి పైగా క్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: పైచదువులకు అమెరికా లేదా కెనడా వెళ్లాలి. ఇప్పుడు దేశంలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. అమ్మానాన్నలు తమ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారని తమ బంధువులకు గొప్పగా చెబుతూ మురిసిపోతున్నారు. ఒకప్పుడు ఈ దేశాల్లో జాబులు బాగానే దొరికేవి. పార్ట్‌టైమ్ జాబులతో విద్యార్థులు తమ ఖర్చుల్ని వెల్లదీసే వారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా లేదా కెనడా కావచ్చు ఉద్యోగాలు అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు.
Read Also: Shivraj Singh Chouhan: రైతులకు గుడ్‌న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి
Also Read
తాజాగా.. కెనడాలో ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు దాని ముందు బారులు తీరిన వీడియోని చూస్తే, పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల కోసం వరసలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కెనడాలో చదువుకోవాలని, పనిచేయాలనుకునే వారిని ఒకటికి రెండుసార్లు ఆలోచింపచేస్తోంది.
లైన్‌లో వేచి ఉన్న విద్యార్థుల్లో ఒకరైన అగంవీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నేను మధ్యాహ్నం 12గంటలకు ఇక్కడికి వచ్చాను. లైన్ భారీగా ఉంది. ఇంటర్నెట్ ద్వారా అప్లికేషన్ పెట్టా. ఇంటర్వ్యూ చేస్తామని చెప్పారు. కానీ అలాంటిదేం జరగలేదు. ఇక్కడ ఉద్యోగం ఉంటుందని నేను నమ్మను’’ అని చెప్పాడు. మరొక విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘ఎవరికీ సరిగ్గా ఉద్యోగాలు లభించడంలేదు. నా స్నేహితుల్లో చాలా మందికి ఉద్యోగాలు లేవు.’’ అని చెప్పాడు.
Scary scenes from Canada as 3000 students (mostly Indian) line up for waiter & servant job after an advertisement by a new restaurant opening in Brampton.
Massive unemployment in Trudeau's Canada? Students leaving India for Canada with rosy dreams need serious introspection! pic.twitter.com/fd7Sm3jlfI
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!