దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ.. డబ్బు, అధికారం, పరిచయాల పేరుతో నిందితులు తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు. వారందనీ.. ఎన్‌కౌంటర్ లో చంపేయాలని జనాలు కోరుతున్నారు. అచ్చం అలాంటి సీన్ తాజాగా విడుదలైన ‘వేట్టయన్- ద హంటర్’ సినిమా ట్రైలర్ లో కనిపించింది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ రోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. సుభాస్కరన్ నిర్మాతగా ఉన్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వేట్టయన్ ద హంటర్‌ని రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అయితే ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
READ MORE: Russia: అరబ్ దేశాలతో రష్యా అత్యవసర భేటీ.. తాజా పరిణామాలపై చర్చ
సూపర్ స్టార్ రజినీ కాంత్ పోలీసు పాత్రలో నటించిన ఈ సినిమాలో, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఇందులో విలన్ ఎవరనే దానికిపై క్లారిటీ రావడం లేదు. ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంగా సాగే కథగా ట్రైలర్ స్పష్టం చేసింది. అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ వ్యతిరేకించే న్యాయమూర్తిగా అమితాబ్.. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ కచ్చితంగా బాధితులకు లభిస్తుందనే పంథాలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్, న్యాయమూర్తికి జరిగిన పోరాటంలో తప్పు చేసిన వాడికి పోలీసుగా శిక్షించడాన్ని నా నుంచి ఎవరు ఆపలేరు అని బిగ్‌బీకి రజనీకాంత్ సవాల్ విసరడం ట్రైలర్ లో చూడొచ్చు.