ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు.
రేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు సబ్సిడీపై కందిపప్పు, పంచదార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకురావాలనేది వైయస్సార్ వైసీపీ ఉద్దేశం కాదని.. చంద్రబాబు వివాదమాయం చేయాలని ప్రయత్నించినప్పుడు... ఆయన చెప్పిన అబద్ధాలపై వివరాలను మాత్రమే ఇచ్చామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్‌తంగ్ పాస్‌లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.