విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్‌లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి దగ్గరకు వెళ్లారు. కానీ ఇదే అదనుగా భావించిన చిన్నారావు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక మహిళలందరూ కలిసి…
ప్రముఖ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూసూద్‌కు మరో షాక్ తగిలింది. గెస్ట్ హౌస్ కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవనంలో సోనూసూద్ హోటల్ నడుపుతున్నారని… కోర్టు ఆదేశాల ప్రకారం సదరు హోటల్‌ను నివాస భవంతి మార్చుతానని మాట ఇచ్చిన ఆయన ఇంకా నిలబెట్టుకోలేదని ముంబై బృహన్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై సోనూసూద్ వెంటనే స్పందించాలని నోటీసుల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు గుర్తుచేశారు. Read Also: హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం.. ఒకేరోజు…
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వాళ్ల కళ్లుగప్పి పలువురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం తాగి వాహనాలను డ్రైవింగ్ చేస్తున్నారు. సోమవారం ఒకేరోజు పలువురు వ్యక్తులు తప్పతాగి వాహనాలు నడపటంతో మూడు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారు. బంజారాహిల్స్, నార్సింగి, ఎస్.ఆర్.నగర్‌లో ఈ రోడ్డుప్రమాదాలు చోటుచేసుకున్నాయి. Read Also: పాములను తరిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవడంతో… నార్సింగి వద్ద సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారుతో…
నాగాలాండ్‌లో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటన తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనికులు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా తెలిపారు. నాగాలాండ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. Read Also: వైరల్ వీడియో: చిన్నారి ప్రాణాన్ని…
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం ఏకంగా బిడ్డ ప్రాణాన్నే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేద్దామని తల్లిదండ్రులు తమ చిన్నారితో కలిసి బైకు మీద బయటకు వచ్చారు. అయితే చిన్నారిని బైక్ నుంచి కిందకు దింపకుండా బండి మీదే కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్డుపై షాపింగ్ చేస్తున్నారు. బైక్ మీద కూర్చున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా… బైకు అదుపు…
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి. Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం మరోవైపు…
నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా చూస్తుండగా ఓ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే జిల్లాలోని రవిశంకర్ సినిమా థియేటర్‌లో యథావిధిగా సాయంత్రం అఖండ ఫస్ట్ షో ప్రారంభమైంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి తరువాత తెరవెనుక ఉన్న సౌండ్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారి ఖంగుతిన్న ప్రేక్షకులు థియేటర్ బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం, సిబ్బంది మంటలు…
ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది. డెల్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే ఈ డేంజరస్ వైరస్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. అయితే నిన్నటి వరకు కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, మహారాష్ట్రలో 1, ఢిల్లీలో 1 చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్‌మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ స్పందించింది. టీటీడీ ఉద్యోగాలంటూ సోషల్‌మీడియాల ప్రకటనలు నమ్మొద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇలా అవాస్తవ ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగ ప్రకనపై పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతామని, ఇలాంటి వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది.