తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం ఏకంగా బిడ్డ ప్రాణాన్నే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేద్దామని తల్లిదండ్రులు తమ చిన్నారితో కలిసి బైకు మీద బయటకు వచ్చారు. అయితే చిన్నారిని బైక్ నుంచి కిందకు దింపకుండా బండి మీదే కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్డుపై షాపింగ్ చేస్తున్నారు.
బైక్ మీద కూర్చున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా… బైకు అదుపు తప్పి కిందపడిపోయింది. సరిగ్గా ఆ సమయంలో రోడ్డుపై లారీ వెళ్తుండగా… చిన్నారి కిందపడిపోగా లారీ వెనుక చక్రాలు ఆ పసివాడిపై నుంచి వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. చుట్టుపక్కల వారు కాపాడదామని ప్రయత్నించినా రెప్పపాటు ఈ ఘటన జరిగిపోవడంతో వారు ఏం చేయలేకపోయారు. తమ కళ్ల ముందే చిన్నారి రెప్పపాటు గ్యాప్‌లో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి వారు కన్నీటి పర్యంతమయ్యారు. తాము చేసిన నిర్లక్ష్యమే ఆ తల్లిదండ్రులకు శాపంలా మారింది. ఈ ఘటన ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగిందని సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. కానీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో అన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. ఏదైమైనా పిల్లలను బయటకు తీసుకువెళ్లినప్పుడు వాహనాలపై వాళ్లను వదిలి ఎక్కడికీ వెళ్లరాదని ఈ ప్రమాదం అందరికీ గుణపాఠం నేర్పుతోంది.