హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పెద్దమొత్తంలో పలువురి మొబైళ్లు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని బాధితులు తమ మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదులను హాక్ ఐ యాప్‌ను ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో మొబైల్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ చెప్తున్నారు. Read Also: గుడ్‌న్యూస్.. త్వరలో భారత్ నుంచి మరో…
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో…
భద్రాచలంలోని రామయ్యను సోమవారం సాయంత్రం ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి కొడాలి నాని కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని శ్రీరాముడికి రూ.13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఈ మేరకు కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. Read Also: సైబర్ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్ ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో…
యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించింది. ఆమె 27 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం అందరినీ కలిచివేస్తోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లోనూ శ్రియా మురళీధర్ ఓ పాత్రలో నటించింది. అనంతరం యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించింది. Read…
కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా డీఈవో కె.శామ్యూల్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో గానీ, అనాథాశ్రమంలో గానీ వారం రోజులు భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కక్షిదారులకు న్యాయం దొరకకుండా చేయడమే కాకుండా, కోర్టును అవమానించడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. Read Also: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు…
కొత్త సంవత్సరం నుంచి బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తగలనుంది. 2022, జనవరి 1 నుంచి ఏటీఎం సెంటర్లలో అపరిమిత లావాదేవీలు జరిపితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అపరిమిత లావాదేవీలపై రుసుములు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే.. ఎక్కువ రుసుములు వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు…
తెలంగాణలో అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో మద్యం విక్రయాలు తగ్గాయి. అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2,653 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా… నవంబర్ నెలలో రూ.2,158 కోట్ల మద్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. దీంతో రూ.495 కోట్ల మద్యం విక్రయాలు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్‌కు ముందు తెలంగాణలో రోజుకు సగటున రూ.75 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని… కానీ నవంబర్‌లో రోజుకు రూ.70 కోట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. Read Also:…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్‌లో భయం లేని హీరో అంటే అల్లు అర్జున్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నాడు. రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్‌ను చూసి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్‌ఫెక్ట్ అని ఆర్జీవీ కొనియాడాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్…
తెలంగాణలో శీతల గాలులు వీస్తుండటంతో చలి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఐదు వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సోమవారం నాడు మెదక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 13.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14,8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17 డిగ్రీలు, ఖమ్మంలో 19 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.8 డిగ్రీలు, నల్గొండలో 20 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. Read Also: వరల్డ్ రికార్డ్:…