హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వాళ్ల కళ్లుగప్పి పలువురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం తాగి వాహనాలను డ్రైవింగ్ చేస్తున్నారు. సోమవారం ఒకేరోజు పలువురు వ్యక్తులు తప్పతాగి వాహనాలు నడపటంతో మూడు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారు. బంజారాహిల్స్, నార్సింగి, ఎస్.ఆర్.నగర్‌లో ఈ రోడ్డుప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Read Also: పాములను తరిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవడంతో…
నార్సింగి వద్ద సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు బంజారాహిల్స్‌లో రోహిత్ అనే వ్యక్తి తాగిన మైకంలో స్కూటీని ఢీకొట్టగా ఇద్దరు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. అంతకుముందు ఎస్.ఆర్.నగర్‌లో ఓ యువకుడు తప్పతాగి ఆటో నడపటంతో… ఆటో ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకే రోజు నలుగురు మరణించడం గమనార్హం.