Polimera 3: ‘పొలిమేర 3’ నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polimera 3: హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ‘పొలిమేర’ తెలుగు ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. గ్రామీణ నేపథ్యం, చేతబడులు, మిస్టరీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సిరీస్ మొదటి రెండు భాగాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మూడో భాగంపై కూడా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పొలిమేర 3’ నుంచి వచ్చిన తాజా అప్డేట్ సినిమాపై మరింత హైప్ ను పెంచుతోంది. గత కొన్ని రోజులుగా బ్లాస్ట్ స్టార్ అర్జున్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ ప్రచారానికి తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అర్జున్ను ‘పొలిమేర 3’ లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ప్రధాన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యం రాజేష్ మరోసారి కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన సరసన కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తున్నారు.
అంతేకాదు కథను మరింత ఇంటెన్స్ గా కొనసాగించేందుకు కొన్ని కీలక పాత్రల్లో కొత్త ముఖాలను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అర్జున్ పాత్ర కథలో కీలక మలుపులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హారర్, థ్రిల్లర్, ఫోక్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి రెండు భాగాల్లో కథను నడిపించిన విధానం ప్రశంసలు అందుకోవడంతో, ఇప్పుడు మూడో భాగంలో మరింత థ్రిల్లర్ కంటెంట్ ను తీసుకురానున్నారని తెలుస్తోంది. వంశీ నడిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అర్జున్ ఎంట్రీతో ‘పొలిమేర 3’ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆయన పాత్ర హీరోకు అండగా నిలుస్తుందా ? లేక ఇందులో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే చిత్ర బృందం విడుదల చేయనున్న తదుపరి అప్డేట్ల కోసం వేచి చూడాల్సిందే.
Also Read
- Prabhas - Nbk : ప్రభాస్ ఫౌజీ - బాలయ్య 'దాదా'లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
- Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
- Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Tags
- #polimera 3
- cinema
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!