భద్రాచలంలోని రామయ్యను సోమవారం సాయంత్రం ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి కొడాలి నాని కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని శ్రీరాముడికి రూ.13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఈ మేరకు కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు.
Read Also: సైబర్ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్
ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రామయ్యను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం జగన్‌కు భద్రాద్రి రామయ్య మరింత శక్తి ఇవ్వాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఏపీలోని ప్రజలందరూ ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలన్నదే సీఎం జగన్ అభిమతమన్నారు. కాగా కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ మంత్రిగా కేబినెట్ పదవిని జగన్ కట్టబెట్టారు. మంత్రి కొడాలి నాని మీడియా సమావేశాల్లో ప్రతిపక్షాలపై అవాకులు చెవాకులు వేస్తూ ప్రసంగాలు చేస్తుంటారు.