తెలంగాణలో అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో మద్యం విక్రయాలు తగ్గాయి. అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2,653 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా… నవంబర్ నెలలో రూ.2,158 కోట్ల మద్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. దీంతో రూ.495 కోట్ల మద్యం విక్రయాలు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్‌కు ముందు తెలంగాణలో రోజుకు సగటున రూ.75 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని… కానీ నవంబర్‌లో రోజుకు రూ.70 కోట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
Read Also: ఈ రికార్డు సాధించిన ఒకేఒక్కడు విరాట్ కోహ్లీనే
నవంబర్ నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, కరీంనగర్ జిల్లాల్లోనే ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 2019-21 మద్యం పాలసీని నెలపాటు పొడిగించడంతో నవంబర్ నెలలో అధికంగా మద్యం విక్రయాలు ఉంటాయని భావించిన ఎక్సైజ్ శాఖ లెక్క తప్పింది. అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా నేపథ్యంలో 11 రోజుల్లోనే రూ.1,400 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కాగా డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1 న్యూ ఇయర్ నేపథ్యంలో ఈ నెలలో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.