రేపటి నుంచే యాషెస్ సిరీస్… యాషెస్ పేరు వెనుక చరిత్రేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో బాధపడుతున్నందున.. తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని ఈసీబీ వెల్లడించింది.
Read Also: ఈ రికార్డు సాధించిన ఒకేఒక్కడు విరాట్ కోహ్లీనే
Also Read
కాగా యాషెస్ సిరీస్‌కు యాషెస్ అని పేరు రావడానికి వెనుక చాలా చరిత్రే ఉంది. 1882లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. దీంతో బ్రిటన్ మీడియా ఇంగ్లండ్ జట్టును ఏకిపారేసింది. ఇంగ్లీష్ క్రికెట్ జట్టు చచ్చిపోయిందని పేర్కొంటూ సంస్మరణ ప్రకటించింది. ఇంగ్లండ్ దేహాన్ని దహనం చేసి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్తారని సెటైర్లు వేసింది. ఈ కథనాలపై అప్పటి ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ సీరియస్ అయ్యాడు. ఆ బూడిదను తాము మళ్లీ ఇంగ్లండ్ తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశాడు. దీంతో ఇంగ్లండ్ మీడియా ఆ యాషెస్‌ను తిరిగి తీసుకురావాలని కెప్టెన్ తాపత్రయపడుతున్నట్లు ప్రచురించాయి. అలా యాషెస్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. అప్పటినుంచి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు యాషెస్ సిరీస్ అని నామకరణం చేశారు. దాదాపుగా 140 ఏళ్లుగా యాషెస్ పేరుతోనే ఈ రెండు జట్లు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం అయ్యే సిరీస్‌లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా కమిన్స్, ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా రూట్ వ్యవహరించనున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!