ఏపీలో సినిమా టిక్కెట్ల ధర విషయంపై అగ్గి రాజుకుంది. హీరో నాని చేసిన కామెంట్లపై ఒకవైపు ప్రభుత్వం విమర్శిస్తుంటే.. మరోవైపు పలువురు ప్రతిపక్షాల నేతలు నానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘ఏంటో మరి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. Read Also: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్.. పవన్ మోజులో పడి చాలా తగలేశా..! ‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు…
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జాతిరత్నాలు’ ఫేం హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా పంచ్‌ల పంచ్‌లు వేస్తూ అందరినీ కాసేపు కడుపుబ్బా నవ్వించాడు. సాధారణంగా ప్రతి సినిమాకు ఫైనాన్షియర్స్ ఉంటారని.. కానీ ప్రభాస్ సినిమాకు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారని పంచ్ వేశాడు. అంతటితో ఆగకుండా ప్రభాస్ సినిమాల బడ్జెట్ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. పార్లమెంట్‌లో హెల్త్ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్ కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లే…
హైదరాబాద్ జలసౌధలో గురువారం సాయంత్రం కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ ఆయకట్టును 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచారని, కానీ నీటి కేటాయింపులు పెంచలేదని…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై మంత్రి బొత్స ఇచ్చిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని.. అలాగే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ… ఎమ్మార్పీ అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప.. ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురకలు అంటించారు.…
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ప్రజలకు మంచిదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. ‘సినిమా అందరికి అందుబాటులో ఉండాలి. అందుకే ధరలు తగ్గించాం- మంత్రి బొత్స. మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండక్కర్లేదా వైఎస్ జగన్ గారూ. అవి కూడా తగ్గించండి- ప్రజలు’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. Read…
కర్ణాటకలోని మంగుళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన ఓ మత్స్యకారుడి పట్ల సహచర మత్స్యకారులు దారుణంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే… ఏపీకి చెందిన వైల శీను మంగళూరులో మత్స్యకారుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ కనిపించలేదు. దీంతో వైల శీనునే ఆ మొబైల్ దొంగిలించాడని మిగతా మత్స్యకారులు భావించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఎక్కడ పెట్టావంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. కనీసం వైల శీను చెప్పేది వినకుండా…
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్‌పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు.…
ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్‌లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు కేంద్ర పథకాలు అమలు…
హైదరాబాద్ బాచుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వీఎన్ఆర్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీ…