శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నాడు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కాసేపు కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక టీమ్ తరఫున కబడ్డీ ఆడుతూ కాలు స్లిప్ కావడంతో కింద పడిపోయారు. స్పీకర్ కిందపడగానే ఆయన సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపారు. Read Also: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా…
తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని…
ఈనెల 26 నుంచి టీమిండియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే 20 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన నేపథ్యంలో నార్జ్ స్థానంలో కొత్త ఆటగాడిని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు అభిప్రాయపడింది. Read Also: అత్యాచారం కేసులో చిక్కుకున్న…
తెలంగాణలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం మంగళవారం నాడు నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కింద ఎస్సీ కార్పొరేషన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Read Also: గ్రేట్ టాలెంట్.. ఖమ్మంతో పెట్టుకుంటే కుమ్ముడే..!! సూర్యాపేట జిల్లా…
ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ మంగళవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ఇటీవల నీతి ఆయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక…
ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీ చట్టం 2021 ప్రకారం యాంటీ ఇండియా, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలతో 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. Read Also: మహిళలకు రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన ప్రధాని మోదీ…
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం జగన్‌కు…
పంజాబ్‌లోని లుథియానాలో దారుణం వెలుగు చూసింది. చేతబడి అనుమానంతో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే… లుథియానా శివారులోని మెహర్బన్ ప్రాంత పరిధిలోని చుహర్వాల్ గ్రామంలో ఈనెల 18న రాత్రి కౌర్ అనే వృద్ధురాలితో తల్లి, కొడుకులు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో కౌర్ ప్రార్థనల కోసం గురుద్వారాకు వెళ్తుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. కౌర్ చేతబడి చేస్తుందన్న ఆరోపణలతో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని…
ఈనెల 21న (మంగళవారం) ఏపీ సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బోకేలు, శాలువాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయని.. అదే ఒకరికి సాయం చేస్తే చిరకాలం గుర్తుంటుందని రోజా భావిస్తున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న రోజా.. ఈ ఏడాది నగరి నియోజకర్గంలోని ముస్లిం…