దేశంలో ఆందోళన రేకెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయింది. బుధవారం కాస్త పెరిగిన కరోనా కేసులు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం 71,365 కేసులు నమోదు కాగా గురువారం కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,06,520గా ఉంది.
Read Also: Encounters: ఐదేళ్ళలో దేశంలో 655 ఎన్ కౌంటర్లు
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,67,882 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,11,80,751కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,71,28,19,947 మందికి కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది. అటు గడిచిన 24 గంటల్లో 46,44,382 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అటు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,90,789గా ఉంది. అంటే ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల శాతం 1.86గా నమోదైంది. దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది.