Numaish: ఈనెల 20 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్‌ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్నారు.
కాగా జనవరి 1న గవర్నర్ తమిళిసై ప్రారంభించిన నుమాయిష్ మరుసటి రోజే కరోనా నిబంధనల కారణంగా మూతపడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నుమాయిష్‌ను అర్ధాంతరంగా అధికారులు నిలిపివేశారు. తాజాగా కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఎగ్జిబిషన్ నిర్వహణపై ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
Also Read
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
- Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
-
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
-
Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!