★ నేడు మరోసారి హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం జగన్.. హైటెక్స్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరుకానున్న జగన్
★ ఏపీ వ్యాప్తంగా పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాల నిరసనలు. 27 శాతానికి మించి ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్.. నేడు కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ
★ తూ.గో.: నేడు, రేపు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు
★ ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు మెగా జాబ్ మేళా
★ నేడు జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభ
★ నేటితో ముగియనున్న తొలివిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు
★ నేటి నుంచి మూడు రోజుల పాటు మహారాష్ట్రలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన..
★ అహ్మదాబాద్: నేడు భారత్-వెస్టిండీస్ మూడో వన్డే.. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్