విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలానికి అనుగుణంగా అనురాగ్ సెట్, అగ్రి సెట్ పేర్లతో ఎంట్రన్స్ పరీక్షలను అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనురాగ్ సెట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేయగా.. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి అగ్రి సెట్‌ను ఏర్పాటు చేశారు. అనురాగ్ సెట్, అగ్రి సెట్ పరీక్షలకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. ఆయా పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 3 వరకు సమర్పించవచ్చని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మార్చి…
హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో…
ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. సమస్యను ఉద్దేశపూర్వకంగా సృష్టించి, మళ్లీ ఆ సమస్యను పరిష్కరించినట్లు సీఎం జగన్ బిల్డప్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు ఎవరు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించమన్నారు? ఎవరు పెంచమన్నారు వైఎస్ జగన్? మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించినట్లు డైవర్షన్ పాలిట్రిక్స్ చేయడం మీకే చెల్లింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి…
క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్‌లో సచిన్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది.…
హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు. అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని…
ఏపీ రాజధాని ఏది అంటే ప్రస్తుతం ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. ఇది విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతిబింబించింది. నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. తాజాగా కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది అటు తాజాగా దేశవ్యాప్తంగా…
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే…
ఈరోజు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచిన భారత్ ఇప్పుడు మూడో వన్డేపై కన్నేసింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో… ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్‌బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్‌బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468,…