హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నిన్న సాయంత్రం చోటు చేసుకు పరవుహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అయితే.. నీరజ్ పన్వార్ అనే యువకుడిపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపి కర్ణాటక గుడిమత్కల్ లో నిందితులను పోలీసులు గుర్తించారు. నీరజ్ అనే యువకుడినీ కిరాతకంగా హతమార్చింది.. ఆయన బావమరుదులు, స్నేహితులేనని గుర్తించి.. వారిని కర్ణాటక గుడిమిత్కల్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నీరజ్ ను హత్య చేసిన వెంటనే కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి నిందితులు పరారయ్యారు. యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంజన కజిన్ బ్రదర్స్ ను, వారి స్నేహితులను కర్ణాటక గుడిమత్కల్ నుండి హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చారు.
అయితే.. నిన్న రాత్రి కొల్సివడలో ఉన్న తాత జగదీష్ పన్వార్‌తో కలిసి వెళ్తుండగా నీరజ్ పన్వార్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తాత జగదీశ్ పన్వార్ కళ్లముందే దారుణం జరిగింది. నీరజ్ తల, మెడ, ఛాతీ భాగంలో శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్యా చేశారని పోలీసుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఇప్పటికే 10మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & శాహినాడ్ క్రైం & డీసీపీ పార్టీ క్రైమ్ టీమ్ నాలుగు పోలీస్ బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు.