వినినియోదారులకు మరించి చేరువయ్యేందుకు వాట్సాప్ కొత్త కొత్ ఫీచర్లను తీసువస్తూనే ఉంది. అదే సమయంలో వినియోగుదారులకు సంబంధించిన డేటాను భద్రపరచడంలో కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటుంది మెటా. అయితే మెటాలో భాగమైన వాట్సాప్ కొన్ని నెలల్లో ఆ ఐఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్‌వేర్‌లపై పనిచేయస్తున్న పాత ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే…
ఇటీవల బేగంబజార్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి బంధువులు ఆమె భర్త నీరజ్ పన్వార్ అనే యువకుడిని అవమానం భారంతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరజ్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ హోం మంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మినిస్ట్ క్వార్టర్స్‌లో నీరజ్ భార్య సంజన మాట్లాడుతూ.. నా భర్తను హత్య చేసిన వారికి బెయిల్ రాకుండా చూడాలని కోరామని, నిందితులు అరెస్ట్ అయినప్పటికీ…
అతడొక విద్యాబుద్దలు నేర్పాల్సిన గురువు.. అంతేకాకుండా తాను ఇప్పుడు విద్యార్థులకు భవిష్యత్తుకు పునాదైని పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఏకంగా అదే ఎగ్జామ్ సెంటర్‌కి పూటుగా మద్యం తాగి వచ్చి తూలుతూ తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించాడు. హుజురాబాద్ లోని రాంపూర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల పీఈటీ టీచర్ ఆముల రవికుమార్ డ్యూటీలో ఉండగా మొదట ఎగ్జామ్ కి వచ్చిన విద్యార్థులకు అనుమానం…
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం రూపంలో యత్నిస్తోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని శాసనమండి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. రాష్ట్రాలను ఆస్థిర పరిచేందుకు, బలహీన పరిచేందుకు, సంక్షేమ పథకాలు నిలిచిపోయేలా…
తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు రోజురోజుకు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. కరీంనగర్‌లోని సందర్శకులను ఆకర్షించే మానేర్ డ్యామ్‌ను విహంగ వీక్షణం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా ఎయిర్ షో నిర్వహించి.. ప్యారాచూట్ విన్యాసాలకు ఈ ప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్ ఇప్పటికే దీనికి సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో.. మానేరు అందాలతో పాటు కేబుల్ బ్రిడ్జ్, కరీంనగర్ టౌన్‌ని ఆకాశం నుంచి చూసే…
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న స్నాతకోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 26 తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే..…
ఓ మంత్రి అక్రమాలను ప్రశ్నిస్తున్నానని తనపై నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నాడని సమాచార హక్కు చట్టం కార్యకర్త కోయిన్ని వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్ననాని నాపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా.. రఘునాథ పాలే మండలం పువ్వాడ నగర్ గ్రామంలో 2127 ప్రభుత్వ ఇండ్ల స్థలాలను సుమారు 35 కోట్లకు…
తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలను ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కులాలను, మతాలను రెచ్చగొట్టే కుట్ర తెలంగాణలో జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మేము ఉమ్మడి ఏపీలో మంత్రులుగా ఉన్నాము.. కానీ ఇప్పుడు…
ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో పర్యటిస్తూ… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నేతలను ఏకీపారేస్తున్నారు. అయితే నిన్న మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్.. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. మంత్రి మల్లారెడ్డి పలు షాకింగ్ కామెంట్లు చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ..…