Danam Nagender : రేవంత్ రెడ్డివి పగటి కలలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలను ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కులాలను, మతాలను రెచ్చగొట్టే కుట్ర తెలంగాణలో జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మేము ఉమ్మడి ఏపీలో మంత్రులుగా ఉన్నాము.. కానీ ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చూస్తే మేమే తలదించుకునేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధి రేవంత్‌కు కనిపించడం లేదా.? అని ఆయన ప్రశ్నించారు.
కుల, మతాలకు అతీతంగా కేసీఆర్ పాలన చేస్తున్నారన్న దానం.. రేవంత్ అధికారం కోసం ఆరటపడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోని ఇతర సామాజిక వర్గాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు.? ఎందుకు ముగాబోయారు.? అని వ్యాఖ్యానించారు. రేవంత్ కులాల కామెంట్స్ పై భట్టి, మధు యాష్కీ ఇతర నేతలు ఎందుకు మాట్లాడం లేదు…అమ్ముడు పోయారా ? అంటూ ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలను ఆపాలని, కులలపై మాట్లాడితే బలి పశువు అయ్యేది రేవంత్ రెడ్డే… రేవంత్ రెడ్డి ఎవరి ఏజెంటో కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.
Also Read
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!