ఓ మంత్రి అక్రమాలను ప్రశ్నిస్తున్నానని తనపై నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నాడని సమాచార హక్కు చట్టం కార్యకర్త కోయిన్ని వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్ననాని నాపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా.. రఘునాథ పాలే మండలం పువ్వాడ నగర్ గ్రామంలో 2127 ప్రభుత్వ ఇండ్ల స్థలాలను సుమారు 35 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు.
దీంతో పాటు.. మమత ఆసుపత్రి పక్కన ఉన్న పేదలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదనే కక్ష్య తో కరోనా సమయంలో 68 ఇండ్లను కులగొట్టించ్చాడని ఆయన మండిపడ్డారు. మమత ఆసుపత్రి ప్రాంతంలో మంత్రి క్రమబద్దీకరించుకున్న 70 కోట్ల విలువైన 15,000 గజాల స్థలం సంగతి ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి నిజాయితీ పరుడు అయితే జున్ 15వ తేదీన అభివృద్దిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.