Home
Latest Telugu News
Latest Telugu News News
-
Harish Rao : అమిత్ షా, మోడీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు..
ఢిల్లీ నుండి మోడీ వచ్చి ఒక్క మాట చెప్పారా.. రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా.? మనల్ని చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్‌రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, అమిత్ షా, మోడీ వచ్చారు… పేదల కోసం, అభివృద్ధి కొసం ఒక్క మాట చెప్పలేదని ఆయన మండిపడ్డారు. రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొన… -
Srinivas Goud : నిఖత్ జరీన్ ఒలింపిక్స్‌లో కూడా రాణించాలి..
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘన స్వాగతం పలికారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఖత్ జరీన్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించిందని… -
Kishan Reddy కుటుంబపార్టీలకు, పాలనకు బీజేపీ వ్యతిరేకం
సీఎం కేసీఆర్ గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా.. పీఎంను దేశం నుండి తరిమేస్తా.. బీజేపీ నీ బంగళా ఖాతంలో కలిపేస్తానంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ నేను కలిసి దేశమంతా పర్యటిస్తా అన్నారు… ఫెడరల్ ఫ్రంట్ అన్నారు ముందు మీ పార్టీలో గుణాత్మక మార్పు రావాలి, కేసీఆర్ వ్యవహారంలో గుణాత్మక మార్పు రావాలి అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని విమర్శించే నైతిక హక్కు… -
NTV Specials : నల్ల కళ్ళజోడు.. మెడలో నోట్ల దండ.. ఏపీలో వింత ఆచారం..
సాధారణంగా పెళ్లంటే పెళ్లి కొడుకు తాళి కట్టాలి కానీ అక్కడ మాత్రం పెళ్లి కూతురు కూడా తాళి కట్టాల్సిందే. అది అక్కడి ఆచారం. అంతేకాదు పెళ్ళికొడుకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని మెడలో నోట్ల దండ వేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. అది కూడా ఆ ఊరి ఆచారం. అంతేకాదండోయ్ ఒకే రోజు ఒకే ముహూర్తానికి వందల పెళ్లిళ్లు జరుగుతాయి. ఇది ఎక్కడ వింత ఆచారం తంతు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే.. సహజంగా… -
Kanchanbagh Incident : మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి..
హైదరాబాద్‌లో మరో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మహిళను ప్రేమించమని వెంటపడి వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించడంతో పగ పెంచుకున్న ఆ ఉన్మాది ఒంటిరిగా వెళ్తున్న సదరు మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నూరా భాను అనే వివాహిత మహిళను హబీబ్ అనే వ్యక్తి గత సంవత్సరకాలంగా ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో.. అతడి ప్రేమను… -
Sabitha Indra Reddy : ఇబ్బందులు పడుతూ ప్రైవేటు స్కూళ్లకు పంపొద్దు
సీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సబితా ఇంద్రారెడ్డి పలు స్కూళ్లలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాలని చూస్తున్నామని, అందులో భాగంగా విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. నిధులు కూడా కేటాయించామని, హాలియా స్కూల్ లో 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంటే స్కూల్‌కి కలర్… -
PM Modi : తెలంగాణలో కుటుంబపాలన చేసేవారు దేశద్రోహులు..
ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. టీఆర్‌ఎస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. అలాంటి త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసమో కాదన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ… -
Dil Raju : ఎఫ్3 పవన్ కల్యాణ్ నటించారు.. ఇంకా
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా ‘ఎఫ్ 3’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను, రేపు అంటే ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ఈ… -
Ravi Teja : ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఎక్కడం లేటవుతుందట..
మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో నిన్నతరం హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించబోతున్నా్రు. ఈ సినిమాల హీరోయిన్లుగా రజీషా, దివ్యాంశలు నటిస్తున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు.… -
Kapil Sibal : కాంగ్రెస్‌ను వీడడంపై సంచలన విషయాలు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడడంపై కపిల్ సిబల్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చాలారోజులైందని షాకింగ్ విషయం తెలిపారు. అయితే భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ‘ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు.…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!