ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో పర్యటిస్తూ… టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్ నేతలను ఏకీపారేస్తున్నారు. అయితే నిన్న మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్.. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. మంత్రి మల్లారెడ్డి పలు షాకింగ్ కామెంట్లు చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన దరిద్రపు పార్టీ అని, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే.. అక్కడ బీజేపీ గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది రచ్చబండ కాదు…లుచ్చ బండ.. రేవంత్ రెడ్డి…దొంగ రెడ్డి.. రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌కు పోతున్నాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి బట్టేబాజ్ …పెద్ద లుచ్చా.. రేవంత్ ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ మాటాష్.. రేవంత్ ది అంతా బ్లాక్ మెయిల్ జీవితం.. రేవంత్ తర్వాత చేరేది బీజేపీ పార్టీలోకే.. అంటూ నిప్పులు చెరిగారు. మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం నన్ను రేవంత్ బ్లాక్ మెయిల్ చేసాడని ఆరోపించిన మంత్రి మల్లారెడ్డి.. డబ్బుల కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేశారని.. రేవంత్ రెడ్డితో మాట్లాడాలని మధ్యవర్తలను పెట్టానన్నారు. డబ్బులు ఇవ్వాలని… లేకపోతే నా కాలేజీలు మూసివేయిస్తానని రేవంత్ నన్ను బ్లాక్ మెయిల్ చేసాడని, రేవంత్ బిడ్డ పెళ్లి…నా డబ్బులతో చేసాడని ఆయన మండిపడ్డారు. యాదగిరిగుట్ట మీద ప్రమాణం చేయమని రేవంత్ ను అడగండని ఆయన సవాల్ విసిరారు. చివరకు రాహుల్ గాంధీని కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.